ఓటర్ల జాబితా నుంచి తొలగించారని గ్రామస్థుల ఆందోళన - బద్వేలులో ఓటర్లు ఆందోళన
ఓటర్ల జాబితా నుంచి తొలగించారని కడప జిల్లా బద్వేలు మండలం పుట్టాయిపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్న వారు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రతిసారి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న తమను జాబితాలో నుంచి తొలగించడం ఏంటని ప్రశ్నించారు.