ETV Bharat / state

వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి, ఉమామహేశ్వరరెడ్డిని ప్రశ్నిస్తున్న సీబీఐ - కడప జిల్లా

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(viveka murder case)లో కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఎర్ర గంగిరెడ్డి, ఉమామహేశ్వరరెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 32వ రోజు సీబీఐ(CBI) విచారణ కొనసాగుతోంది.

viveka murder case
వివేకా హత్య కేసు
author img

By

Published : Jul 8, 2021, 2:17 PM IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(viveka murder case)లో 32వ రోజు సీబీఐ(CBI) విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఎర్ర గంగిరెడ్డి, ఉమామహేశ్వరరెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

సాక్ష్యాల తారుమారు అభియోగాలపై...

వివేకాకు అత్యంత సన్నిహితుడుగా పనిచేసిన ఎర్ర గంగిరెడ్డి.. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన రోజు ఆయన ఇంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై రెండేళ్ల కిందటే సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్​పైన ఉన్న ఎర్ర గంగిరెడ్డిని అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు.

సుదీర్ఘ విచారణ చర్చనీయాంశమైంది..

వివేకాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, రాజకీయాలు అన్నీ కూడా ఎర్ర గంగిరెడ్డి కనుసన్నల్లోనే జరిగేవనే ఆరోపణలు ఉన్నాయి. వివేకా ఎక్కడికి వెళ్లినా ఎర్ర గంగిరెడ్డి తోడుగా వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో వివరాల సేకరణకు ఇతన్ని గతంలోనే సిట్ అధికారులు గుజరాత్ తీసుకెళ్లి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించారు. ఇపుడు సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తుండటం చర్చనీయాంశమైంది. హత్య జరిగిన రోజు గదిలో సాక్ష్యాధారాలు ఎందుకు చెరిపి వేయాల్సి వచ్చిందనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు వివేకాకు ఎర్ర గంగిరెడ్డితో ఉన్న సంబంధాలు, ఆర్థిక విషయాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

జూలై1న పులివెందులకు చెందిన కృష్ణయ్య, సావిత్రి దంపతులను సీబీఐ అధికారులు రెండో సారి ప్రశ్నించారు. కృష్ణయ్య కుటుంబం.. వివేకాతో అత్యంత సన్నిహితంగా ఉంటుందని సమాచారం. పదిరోజుల కిందట వరసగా వీరి కుటుంబాన్ని నాలుగు రోజుల పాటు ప్రశ్నించారు.

ఇదీ చదవండి: viveka murder case: వివేకా హత్య కేసు.. మూడో రోజూ హాజరైన ఎర్ర గంగిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.