ETV Bharat / state

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. మేజిస్ట్రేట్ ముందుకు దస్తగిరి..!

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. డ్రైవర్ దస్తగిరి మరోసారి విచారణకు హాజరయ్యారు. జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ముందు దస్తగిరి వాంగ్మూలం నమోదు చేసే అవకాశం ఉంది.

viveka murder case
viveka murder case
author img

By

Published : Aug 26, 2021, 12:05 PM IST

Updated : Aug 26, 2021, 1:37 PM IST

కడప వివేకా హత్య కేసులో 81వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ విచారణకు డ్రైవర్ దస్తగిరి హాజరయ్యారు. డ్రైవర్ దస్తగిరి అత్త మాబున్నీసాను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ముందు దస్తగిరిని హాజరుపరిచే అవకాశం ఉంది. సెక్షన్‌ 164 కింద దస్తగిరి వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు సమాచారం.

సమాచారమిస్తే రివార్డు..

వివేకా హత్యకేసులో కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తామని సీబీఐ ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 21న పత్రికా ప్రకటన ఇచ్చింది. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురయ్యారని..హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది జులై 9న వివేకా హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ ప్రకటనలో పేర్కొంది. సామాన్య ప్రజలు ఎవరైనా సమాచారం అందించవచ్చని.. అలాంటి వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ ప్రకటనలో తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి.. తెలిసిన సమాచారం సీబీఐ అధికారులైన దీపక్ గౌర్, రాంసింగ్ లకు అందజేయాలని వారి ఫోన్ నంబర్లు, చిరునామాను ప్రకటనలో వెల్లడించింది.

ఇదీ చదవండి:

Viveka Murder Case: పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి పరిశీలించిన సీబీఐ

Last Updated : Aug 26, 2021, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.