కడప జిల్లాలో మొత్తం 96 పరీక్ష కేంద్రాల్లో 22 వేల మంది అభ్యర్థులు గ్రామ సచివాలయ పరీక్షలు రాశారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రంలోకి పంపించే ముందు అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించారు. గుర్తింపు కార్డు కలిగి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి...