ETV Bharat / state

రైతులకు అందాల్సిన 300 ఎరువుల బస్తాలు మాయం

author img

By

Published : Sep 2, 2020, 12:20 PM IST

రైతులకు కోసం డీసీఎంఎస్​కి 400 బస్తాల ఎరువులు పంపిస్తే కేవలం 100 బస్తాలు మాత్రమే ఉన్నాయి..! విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

vigilance officials checkings
విజిలెన్స్ దాడులు

కడప జిల్లా బ్రహ్మగారిమఠం.. డీసీఎంఎస్-2, శ్రీరామ ఫెర్టిలైజర్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. డీసీఎంఎస్-2 దుకాణానికి మార్కెఫెడ్ ద్వారా 400 యురియా బస్తాలు పంపించగా.. వంద బస్తాలు మాత్రమే ఉన్నాయనీ.. రైతులకు చెందిన మిగిలిన 300 బస్తాల మాయమైనట్లు గుర్తించామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. దుకాణ యజమాని బొమ్ము ధనలక్ష్మి, ఓబురెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఎరువులకు సంబంధించిన ఎవరైనా అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులు అవసరమైనవారు రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదిస్తే ఎమ్మార్పీ ధరలకే 48 గంటల్లో అందజేస్తారని రైతులకు సూచించారు.

ఇదీ చదవండి: ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.