ETV Bharat / state

'రెస్టారెంట్లు, హోటళ్లలో నిల్వ ఆహార పదార్థాలను ఉపయోగిస్తే కఠిన చర్యలు'

రెండు రోజుల నుంచి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్న కడప జిల్లా రాజంపేటలోని ఓ రెస్టారెంట్​పై జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్​ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ సీఐ దస్తగిరి హెచ్చరించారు.

author img

By

Published : Jan 3, 2021, 3:10 PM IST

vigilance officers raids on restaurants rajampeta in kadapa
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

కడప జిల్లా రాజంపేటలోని ఓ రెస్టారెంట్​పై జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో రెండు రోజులు నిల్వ ఉంచిన మాంసాహారం, ఇతర ఆహార పదార్థాలతో పాటు వాడిన నూనెను అధికారులు పరిశీలించారు. నిల్వ ఉంచిన కొన్ని ఆహార ఉన్న పదార్థాలను పరిశీలించి సీజ్​ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అందించడంపై చర్యలు తీసుకుంటామని.. రెస్టారెంట్లపై దాడులు కొనసాగుతాయని విజిలెన్స్ సీఐ దస్తగిరి హెచ్చరించారు. రాజంపేట మండలం ఊటుకూరు పరిధిలో ఉన్న ఈ రెస్టారెంట్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని సంబంధిత పంచాయతీకి అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.