కడప జిల్లా జమ్మలమడుగులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి భారీ స్థాయిలో రాయితీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 2 వాహనాల్లో సుమారు వంద సంచుల రాయితీ శనగ విత్తనాలను జప్తు చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా 50శాతం సబ్సిడీతో శనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నారు. కొంతమంది దళారులు రాయితీ విత్తనాలపై కన్ను వేశారు. రైతుల నుంచి శనగలు తీసుకొని వాటిని మళ్ళీ విత్తన కేంద్రానికి పంపిస్తున్నారు. దళారులు, విత్తన కేంద్ర యజమానులు రాయితీ విత్తనాలను అధిక ధరలకు నల్లబజారుకు సైతం పంపిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అనుమానంతో... దాడులు చేయగా... సుమారు వంద సంచుల రాయితీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ఐచర్ వాహనం, మరో ఆటోను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి