వేంపల్లిలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. వాసవీ మాతను గాజులతో విశేషంగా అలంకరించారు. గర్భగుడి ముందు ముగ్గులు వేసి.. అమ్మవారి ప్రతిమను పెట్టారు. మహిళలు వాసవీ మాత పాటలు పాడి భక్తిని చాటుకున్నారు.
ప్రతి రోజు అమ్మవారిని గుడిలో ప్రాకారోత్సవం నిర్వహిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వాసవి మాతకు అభిషేకం, ఐదు రకాల హారతులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు రాయవరం శివరావు, తోటంశెట్టి చంద్రశేఖర్, మహిళా మండలి అధ్యక్షురాలు తోటంశెట్టి నాగమణెమ్మ, గీతా, నిర్మల, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తితిదే చేపట్టిన అభివృద్ధి పనులకు వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన