ETV Bharat / state

రైలు కింద పడి ఒకరు.. ఉరి వేసుకుని మరొకరు..! - కడపలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య

కడపలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యసనాలకు బానిసై చెడు తిరుగుళ్లు తిరుగున్నాడని తల్లిదండ్రులు మందలించగా.. ఓ యువకుడు ఉరి వేసుకున్నాడు. రాజస్థాన్​కు చెందిన మరో వ్యక్తి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

suicide
suicide
author img

By

Published : Sep 24, 2021, 12:20 PM IST

కడప నగరంలో వేర్వేరు ప్రాంతాలలో ఇద్ధరు వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కడప శ్రీ రామ్ నగర్​కు చెందిన కార్తీక్ వ్యసనాలకు బానిసై చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడని తల్లిదండ్రులు మందలించారు. ఫలితంగా మనస్తాపానికి గురైన కార్తీక్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కిందపడి..

కడప రైల్వే స్టేషన్ పరిధిలోని కనుమలో పల్లి వద్ద గోస్వామి అనే రాజస్థాన్​కు చెందిన వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ARREST: గంజాయి ముఠా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.