ETV Bharat / state

AP Crime News: వ్యక్తిపై కత్తులతో దాడి.. చెరువులో పడి ముగ్గురు మృతి - ఏపీ యాక్సిడెంట్ వార్తలు

AP Crime News: వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు వ్యక్తలు గణేష్​పై కత్తులతో దాడి చేశారు. కర్నూలు జిల్లాలో చెరువులో పడి ఇద్దరు మహిళలు, ఒక బాబు మృతి చెందారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐ భార్య అక్కడికక్కడే మృతి చెందారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 26, 2023, 8:13 PM IST

AP Crime News : వైఎస్సార్‌ జిల్లాలో దారుణం జరిగింది. గణేష్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. పులివెందులలో గణేష్‌పై జనార్దన్‌ రెడ్డి, గౌతమ్​లు కత్తులతో దాచి చేసి పొడిచారు. గాయపడిన గణేష్‌ను పులివెందులోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగదు విషయంలో గణేష్‌పై కత్తులతో దాడి చేసి ఉండవచ్చునని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చెరువులో పడి ముగ్గురు మృతి : కర్నూలు జిల్లా విషాదం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు మండలంలోని సిరాళ్లదొడ్డిలో చెరువులో పడి మరియమ్మ(28), సలోమి(25), లోకేశ్(3), మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మహిళలు గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులో దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. వారితో బాలుడు వెళ్లాడు. బాలుడు గట్టున ఆడుకుంటూ చెరువులో పడిపోయాడు. బాలుడిని కాపాడేందుకు ఇద్దరు మహిళలు చెరువులోకి దిగారు. ఈ క్రమంలో నీట మునిగి మృతి చెందారు. చనిపోయిన ఇద్దరు మహిళలను కాపాడేందుకు మరో ఇద్దరు మహిళలు చెరువులోకి దిగగా.. వారిని గట్టున ఉన్న వారు చీర వేసి ఒడ్డుకు లాగారు. వీరు గ్రామంలో జరుగుతున్న బంధువుల వివాహానికి వచ్చారు. ముగ్గురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆగి ఉన్న లారీ ఢీకొట్టిన కారు.. సీఐ భార్య మృతి : విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఆగి ఉన్న లారీని ఢీకొంది. రోడ్డు ప్రమాదంలో మంగళగిరి ఇంటిలిజెన్స్ సీఐ రాఘవేంద్ర రావుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో సీఐ భార్య అక్కడికక్కడే లక్ష్మి శైలజ మృతి చెందారు. రాఘవేంద్రరావుకు జగ్గయ్యపేటలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు ఆయన్ను తరలించారు.

బోల్తా పడిన ఆటో.. ఒకరు మృతి : పల్నాడు జిల్లా మాచర్ల మండలం గోపాలపురం వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుష్మిత(16) మృతి చెందింది. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. అతి వేగమే కారణమా! : విజయవాడ రామవరప్పాడు రింగ్ ఫ్లై ఓవర్ వద్ద ఆర్టీసీ బస్సుని టిప్పర్ లారీ ఢీ కొట్టింది. జగనన్నహోసింగ్ కాలనీకి వెళ్లి వస్తున్నట్లుగా సమాచారం.బస్సులో ఉన్న పలువురు మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు యు టర్న్ తీసుకుంటుండగా ఎదురుగా అతి వేగంతో వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.