రెండు వారాల కిందట కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం పట్టణ సీఐ మధుసూదనరావు చెప్పిన సమాచారం మేరకు ఈనెల ఎనిమిదో తేదీన జమ్మలమడుగులోని కిరాణా దుకాణంలో లక్ష్మీ నరసయ్య, దస్తగిరి రెడ్డి అనే వ్యక్తులు ఇంటి వెనుక వైపు నుంచి తాళాలు పగలగొట్టి దుకాణంలోకి చొరబడ్డారు.
క్యాష్ కౌంటర్లో 50 వేల రూపాయల నగదును దొంగలించి పారిపోతుండగా.. దుకాణం యజమాని ఉమా మహేష్ అడ్డుపడ్డాడు. పెనుగులాటలో ఇద్దరు నిందితులు కత్తి తీసుకుని యజమాని గొంతు, తలపై తీవ్రంగా గాయం చేసి పారిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదేరోజు కేసు నమోదు చేసిన పోలీసులు. మంగళవారం కోవెలకుంట్ల బైపాస్ వద్ద నిందితులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పట్టుకున్నారు. వాహనంతోపాటు కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: