కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న ఇద్దరిని సిబ్బందితో కలిసి ఎస్సై నరసయ్య అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,46,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు. నిందితులు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి రాజా, వెంకటగిరి మోహన్‌గా గుర్తించారు. వీళ్లపై గతంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నగదు అపహరణ కేసు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 7,073 కరోనా కేసులు, 48 మరణాల