కడప జిల్లా రైల్వే కోడూరు మండలం పరిధిలోని ఎస్ ఉప్పరపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై ప్రైవేటు బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రైల్వేకోడూరుకు చెందిన మార్కండేయ (23), బెల్లంకొండ రెడ్డయ్య(19) అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ ఆదివారం రాత్రి శెట్టిగుంట వైపు వెళుతుండగా ఆ వైపు వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే వారు ఇద్దరు చనిపోయారు. మార్కండేయ ద్విచక్ర వాహనాల మెకానిక్ కాగా, రెడ్డయ్య ఎలక్ట్రిషన్‌గా పని చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నారు. వారిద్దరు మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ హేమాద్రి పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి: ఈమె కన్న తల్లేనా? పసి బిడ్డపై మరీ ఇంత పైశాచికత్వమా?