కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం జరిగింది. విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. గాంధీ రోడ్డులోని ఓ ఇంటి మేడపైన మరమ్మతులు చేస్తుండగా కింది భాగంలో ఉన్న ఫ్లెక్సీ బోర్డును పైకి లాగేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలో ఫ్లెక్సీ బోర్డు విద్యుత్ తీగలకు తగిలింది.
బోర్డు నుంచి విద్యుదాఘాతానికి గురైన కార్మికులు కొండయ్య, జమాల్ బాషా... అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతుల కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజు అక్కడికి చేరుకుని జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
ఇదీ చదవండి: