ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడం భారతీయుడి బాధ్యత, కర్తవ్యమని, ఈ పవిత్ర కర్తవ్య నిర్వహణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి స్పష్టం చేశారు. భారత్ - చైనా సరిహద్దుల్లో దేశ సార్వభౌమత్వ పరిరక్షణ కోసం అసువులు బాసిన తెలుగు యోధుడు కర్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత వీర జవాన్లు అమరులైయ్యారు. వారి సంస్కరణార్ధం "షహీదన్ సలాము దివస్" పేరుతో కాంగ్రెస్ మౌన దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు కడప జిల్లా వేంపల్లిలోని తన నివాసంలో తులసిరెడ్డి మౌనదీక్ష చేస్తున్నారు. జై జవాన్ జై కిసాన్ అనేది నినాదం కాదని కాంగ్రెస్ పార్టీ ఆత్మ అని.. అవసరమైతే ప్రతి కార్యకర్త ఒక జవాన్ అవుతాడని తులసిరెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి...