ETV Bharat / state

'మద్యం అమ్మకాలపై జగన్ సర్వీస్ టాక్స్'

వైకాపా హామీఇచ్చిన విధంగా మద్యనిషేధాన్ని అమలు చేయడంలేదని... పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపించారు. మద్యం ధరలు పెంచితే కొనుగోలు తగ్గి... ఆదాయం తగ్గాలి కానీ ఎలా పెరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

Tulasireddy on ycp liquor policy
ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి
author img

By

Published : Dec 7, 2019, 6:43 PM IST

మీడియాతో మాట్లాడుతున్న పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి
మద్యనిషేధం విషయంలో ప్రభుత్వం వైఖరి.. చిత్తం శివుడి మీద... భక్తి చెప్పుల మీద అన్నట్లుందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. మద్యం అమ్మకాలపై జేఎస్టీ(జగన్ సర్వీస్ టాక్స్) వేస్తున్నారని ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లెలో తులసి రెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యం నిషేధిస్తామని చెప్పిన వైకాపా.. ఇప్పుడు ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచుకుంటుందని ఆరోపించారు. వైకాపా దొంగ నీతికి ఎక్సైజ్ ఆదాయం వృద్ధే నిదర్శనమని తులసిరెడ్డి పేర్కొన్నారు. మద్యం నిషేధం అమలు చేస్తే.. ఎక్సైజ్ ఆదాయం తగ్గాలి కాని... 2019- 20 బడ్జెట్​లో రూ.2297 కోట్లు అదనంగా చూపడం ఏమిటని ప్రశ్నించారు.

మోదీ జీఎస్టీ.. జగన్ జేఎస్టీ

మద్యం ధరలు పెంచితే తాగడం తగ్గుతుందని ప్రభుత్వం చెప్పడం ఆత్మవంచన అవుతుందని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం జీఎస్టీ పెంచి వినియోగదారుల నడ్డి విరిస్తే... వైకాపా జేఎస్టీ (జగన్ సర్వీస్ టాక్స్) వేసి సామాన్యుణ్ని దోచుకుంటుందన్నారు. అదనపు జేఎస్టీ చెల్లిస్తే... కావాల్సినంత మద్యం లభిస్తుందన్నారు. పర్మిట్ గదులు రద్దు చేయడం వలన తాగుబోతులు ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్యం నిషేధాన్ని సరిగ్గా అమలుచేయాలని సూచించారు.

ఇదీ చదవండి :

ప్రభుత్వ నిర్ణయంతో మాకేం పని.. దుకాణం వెనుకే కానీ కానీ!

మద్యపాన నిషేధం విషయంలో చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్లుంది వైకాపా ప్రభుత్వం వైఖరి అని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు న రెడ్డి తులసి రెడ్డి అన్నారు.

యాంకర్ వాయిస్ :-కడప జిల్లా వేంపల్లెలో తన స్వగ్రామంలో రెడ్డి తులసి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతుంది. మానవ సంబంధాలు ధ్వంసమై పోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యపానాన్ని నిషేధిస్తా అని చెప్తూ మరోవైపు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచుకోవడం వైకాపా దొంగ నీతికి నిదర్శనమని తులసి రెడ్డి అన్నారు. మద్యపాన నిషేధం అంటూ న 2018-19 టిడిపి పాలనలో కంటే టే 2019- 20 వైకాపా పాలనలో రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయాన్ని బడ్జెట్లో 2297 కోట్లు అదనంగా చూపడం గమనార్హం. మద్యం ధరలు పెంచితే త్రాగడం తగ్గుతుందని ప్రభుత్వం చెప్పడం ఆత్మవంచన అవుతుంది. ధరలు పెంచడం వలన తాగుబోతులు కుటుంబాలు వీధిన పడతాయని కాపురాలు దెబ్బ తింటారు. మోడీ ప్రభుత్వం జీఎస్టీ పెంచి వినియోగదారుల నడ్డి విరిచిన ట్లు వైకాపా ప్రభుత్వం ఒక్కొక్క మద్యం బాటిల్ మీద 20 రూపాయల నుండి 80 రూపాయల వరకు ధర పెంచింది. దీనిని JST అంటే జగన్ సర్వీస్ టాక్స్ అంటారు. ఇది కాక అదనపు JST ధర చెల్లిస్తే బ్లాక్లో కావాల్సినంత మద్యం లభిస్తుంది ఆయన అన్నారు. మద్యం షాప్ లో పర్మిట్ గదులు లేని కారణంగా త్రాగుబోతులు ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారు. లేదా ఇంటికి తీసుకెళ్లి తాగుతున్నారు. ప్రతి తాగుబోతు ఇల్లు బార్ షాప్ గా తయారైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్యపాన నిషేధాన్ని కృషి చేయవలసిందిగా రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి ఉపాధ్యక్షుడు న రెడ్డి తులసి రెడ్డి సూచించారు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.