ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి.. ఎర్రగుంట్లలోని జిల్లా కార్యదర్శి సుబ్రమణ్యం ఇంట్లో కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఆర్టీపీపీ మూసివేత చర్యపై ఆయన మండిపడ్డారు. చీకటిలో మగ్గుతున్న రాయలసీమ ప్రజలు వెలుగులో జీవించాలని 1987వ సంవత్సరంలో అప్పటి సీఎం స్వర్గీయ యన్టీఆర్ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. దానికోసం దాదాపు 2800 ఎకరాల భూమిని సమకూర్చారని పేర్కొన్నారు. అప్పటి నుంచి దిన దినాభివృద్ది చెంది 6 యూనిట్లతో 1650 మేఘావాట్ల విద్యుత్ ఉత్పాదన చేస్తూ.. జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొందిందని గుర్తు చేశారు.
ఈ ప్లాంట్ను నమ్ముకొని ప్రత్యక్షంగా 4వేల కుటుంబాలు.. పరోక్షంగా మారెన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తూన్నాయని తులసి రెడ్డి తెలిపారు. మూసివేత చర్య ద్వారా.. ఈ కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. గత నాలుగు మసాల నుంచి విద్యుత్ ఉత్పాదన కాలేదన్నారు. జిల్లావాసి అయిన సీఎం జగన్ హయాంలో ఈ సంస్థ ముసివేసే దిశగా అడుగులువేయడం బాధాకరమన్నారు. వైఎస్సార్ ఈ సంస్థ అభివృద్ధికి సహాయసహకారాలు అందించిన విషయాన్ని తులసిరెడ్డి గుర్తుచేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విజృంభణ.. కొత్తగా 8,147 కేసులు