ETV Bharat / state

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య - ఏపీ నేర వార్తలు

crime news: వసతి గృహంలో ఉరేసుకుని ఇంజనీరింగ్​ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. బైక్​పై వెళుతుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో యువకుడు మద్యం మత్తులో తల్లిని చితకబాదగా.. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

today crimes
today crimes
author img

By

Published : Jan 31, 2022, 9:50 AM IST

Updated : Jan 31, 2022, 3:52 PM IST

ap crime:

ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. పోలీసుల దర్యాప్తు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థి రవితేజ వసతిగృహంలో ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడు అల్లంశెట్టి రవితేజ(19).. శ్రీకాకుళానికి చెందిన వాడని తెలుస్తోంది. ఈ ఘటనపై తాడేపల్లిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తూర్పు గోదావరిలో దారుణం.. వ్యక్తి దారుణ హత్య

తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం గుండాల కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు వరదారావును దుండగులు కత్తితో పొడిచి హత్యచేశారు. ఈ హత్యకు భూ వివాదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది.

ప్రకాశం బ్యారేజీపై రోడ్డుప్రమాదం.. ఎగిరి నదిలో పడి మృతి

కడప జిల్లా వేంపల్లె మండలంలోని వీరన్నగట్టుపల్లె బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వేంపల్లెకు చెందిన జగదీష్ (25) అనే యువకుడు మృతి చెందాడు. వేంపల్లెలోని కాలేజి రోడ్డులో నివాసం ఉన్న జగదీష్ డ్రైవర్​గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దాదాపు 6 సంవత్సరాల క్రితం ఇడుపులపాయలో శాంతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి వేంపల్లె నుంచి ఇడుపులపాయకు బైక్​పై వెళ్తుండగా వీరన్నగట్టుపల్లె బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మృతి చెందాడని బంధువులు తెలిపారు. స్థానికులు, బంధువుల సమాచారంతో వేంపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని వేంప్లలె ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.

మద్యం మత్తులో తల్లిని చితకబాదిన కుమారుడు.. చికిత్స పొందుతూ మృతి

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో దారుణం జరిగింది. మద్యం మత్తులో కుమారుడు.. తల్లిని చితకబాదాడు. చికిత్స పొందుతూ తల్లి కంచుమోజు రమణ(55) మృతి చెందారు. మూడో రోజుల క్రితం తల్లిపై దాడి చేయగా.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ ప్రకాశం బ్యారెజీపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని లబ్బీపేటకు చెందిన అబ్దుల్ ఖాదర్, కుమారుడు ఫిరోజ్ ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారు. కారు ఒక్కసారిగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. బైక్ వెనుకవైపు కూర్చున్న అబ్దుల్ ఖాదర్.. కృష్ణా నదిలోకి ఎగిరి పడిపోయారు. ఫిరోజ్ తీవ్రంగా గాయపడ్డారు. నీటికిలోకి పడిపోయిన అబ్దుల్ ఖాదర్​ను పోలీసులు బయటకు తీశారు. అప్పటికే ఆయన మృతి చెందారు. ఫిరోజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

లారీనే అపహరించారు..

కర్నూలు జిల్లా బేతంచర్ల పట్టణంలో దొంగలు ఏకంగా లారీనే అపహరించారు. నాగరాజు అనే వ్యక్తికి 2 లారీలు ఉన్నాయి. వీటిని రాత్రి సాయిబాబా ఆలయం సమీపంలో నిలిపి ఉంచారు. అర్ధరాత్రి సమయంలో ఓ లారీని దొంగలించి... ఏపీ మోడల్ స్కూల్ ప్రాంతానికి తరలించారు. లారీ 9 టైర్లు, 9 డిస్కులు, 2 బ్యాటరీలు, 30 లీటర్ల డీజిల్, 2 జాకీలు దొంగలించారు. వీటి విలువ 6 లక్షల రూపాయలు ఉంటుందని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

బావిలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి

Last Updated : Jan 31, 2022, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.