కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం లోమడ గ్రామానికి చెందిన సతీష్‌రెడ్డి అనే రైతు పొలంలో చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. సతీష్‌రెడ్డి తన 5ఎకరాల పొలంలో చీనీ మొక్కలు సాగు చేసుకుంటుండగా... గుర్తు తెలియని వ్యక్తులు 103 చీనీ చెట్లను నరికివేశారు. తనను ఇబ్బంది పెట్టేందుకే చెట్లను నరికివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
ఇదీ చూడండి: