కడప జిల్లా బద్వేల్లోని అగ్రహారంలో భూవివాదంలో పుల్లయ్య అనే వ్యక్తిని ఇటీవల ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ కేసులో నిందితులైన కొండబాబు, శ్రీనివాసులుతో పాటు మరొకరిని మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్ గోపవరం చెక్పోస్ట్ వద్ద అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
హతుడు పుల్లయ్య మేనత్తకు పిల్లలు లేరు. బద్వేల్ బైపాస్ రోడ్లో ఆమెకు 30 సెంట్లు స్థలం ఉంది. పుల్లయ్యతో పాటుగా.. మేనల్లుళ్లైన శ్రీనివాసులు, కొండబాబు... చెరో 15 సెంట్లు మేనత్త నుంచి రిజిస్టర్ చేయించుకున్నారు. తన వాటాకు రావలసిన స్థలాన్ని ఇవ్వాలని పుల్లయ్య వారిని నిలదీశాడు. కొండబాబు, శ్రీనివాసులు.. మరో వ్యక్తితో కలిసి పుల్లయ్యను కర్రలతో కొట్టి హత్య చేశారు.
మృతుడి కుమారుడు నితీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి:
దళితులకు అన్యాయం జరుగుతోందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు: హోంమంత్రి