కడప జిల్లా ప్రొద్దుటూరులో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు అయ్యారు. పట్టుబడిన చాంద్‌బాషా, శంషీర్, మహబూబ్‌బాషాపై గతంలో కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులు చాపాడు, పెద్దముడియం వాసులుగా గుర్తించారు. దుంగలు, 6 వేట కొడవళ్లు, రవాణాకు ఉపయోగించిన 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ చట్టం ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. నలుగురు బడా స్మగ్లర్లకు చెందిన రూ.10 కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు ఆయన తెెలిపారు.
ఇదీ చదవండి: చౌక దుకాణ డీలర్‌పై కత్తితో దాడి .. వివాహేతర సంబంధమే కారణమా?