కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో మట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.2,05,000 నగదు, ఆరు చరవాణులు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు . మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్ ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ప్రొద్దుటూరులో క్రికెట్ బుకీలు అరెస్ట్