నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో.. కడప జిల్లాలో వర్షాలు కుంభవృష్టిని తలపిస్తున్నాయి. జిల్లాలోని జలాశయాలు నిండుకుండలుగా మారాయి. రాజంపేట వద్ద అన్నమయ్య జలాశయం వరద ఉద్ధృతి భయానకంగా ఉంది. ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పోటెత్తుతూనే ఉంది. జలాశయం ఎర్త్ బండ్ వద్ద పూర్తిగా కొట్టుకుపోయింది. జలాశయ పరివాహక గ్రామాలను వరద ముంచెత్తింది. గుండ్లూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. సుమారు 30 నుంచి 40 మంది గల్లంతయ్యారని అధికారుల అంచనావేస్తున్నారు. అలాగే చెయ్యేరు నదిలో 16 మంది గల్లంతయ్యారు. అలాగే రాజంపేట మండలం బాదనగడ్డపై వరద ప్రవాహం. నందలూరు-రాజంపేట మధ్య రైల్వేట్రాక్ కొట్టుకుపోయింది. దీనివల్ల రైళ్ల రాకపోకలు స్తంభించాయి. నందలూరు వద్ద మూడు మృతదేహాలను వెలికితీశారు.
ఇదీ చదవండి: