ETV Bharat / state

రెచ్చిపోతున్న దొంగలు.. భయాందోళనలో ప్రజలు - విశాఖలో చోరి

Theft Incidents in Andhra Pradesh: రాష్ట్ర ప్రజలను దొంగతనాలు వణికిస్తున్నాయి. ప్రతిరోజు ఎదో ఓ జిల్లాలో చోరి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. ఈ వరస దొంగతనాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

theft_incidents_in_andhra_pradesh
theft_incidents_in_andhra_pradesh
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 9:22 PM IST

Theft Incidents in Andhra Pradesh: రాష్ట్రంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు, ఎక్కడ దొంగలు రెచ్చిపోతున్నారో అర్థం కావడం లేదు. చోరీలకు పాల్పడేందుకు ముందుగానే రెక్కీలు నిర్వహించి.. ఎవరికీ అనుమానం రాకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే.. దాడులకు తెగబడుతున్నారు. ఈ వరుస దొంగతనాల వల్ల రాష్ట్రంలోని ప్రజలు హడలెత్తిపోతున్నారు.

అనంతపురం జిల్లాలో వరుస చోరీలు : అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో మూడు రోజుల్లో జరిగిన 3 దొంగతనాల వల్ల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కసాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 3రోజుల్లోనే.. రెండు ఇళ్లలో, మూడు దుకాణాల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు (Theft in Guntakal). మొదట కసాపురం రోడ్డులోని ఓ ఇంట్లో దాదాపు 55 తులాల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి ఎత్తుకెళ్లారు.

ఆ ఘటన మరవక ముందే.. రెండు రోజుల తర్వాత దొంగలు మరోసారి రెచ్చిపోయారు. పట్టణంలోని మెయిన్​ రోడ్డులో గల 3దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లారు. 5 వేల రూపాయల నగదు, గ్యాస్​ సిలిండర్​ ఎత్తుకెళ్లారని ఓ దుకాణ యాజమాని తెలిపారు. చోరీకి పాల్పడిన ఘటన దుకాణాల వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. కసాపురం పోలీస్ స్టేషన్​లో సిబ్బంది కొరత ఉందని సమాచారం. దీంతో పట్టణంలోనూ.. గ్రామీణ ప్రాంతంలో గస్తీ నిర్వహించాలంటే పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది.

నగల వ్యాపారి ఇంట్లో చోరీ.. ఛేదించిన పోలీసులు.. 9కిలోల బంగారం స్వాధీనం

కడప జిల్లాలో పట్టపగలే : కడప జిల్లాలో దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. జిల్లాలోని వేంపల్లి పట్టణ పరిధిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడి 14తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. స్థానిక చైతన్య హైస్కూల్​ వీధి సమీపంలో.. సింగారెడ్డి అమర్నాథ్​ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అమర్నాథ్​ ఇంట్లో లేని సమయంలో ఆయన తల్లి నాగసుబ్బమ్మ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దొంగలు.. చోరీకి యత్నించారు. ఈ క్రమంలో ఆమె దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు అమర్నాథ్​ వివరించారు. దుండగులు నాగసుబ్బమ్మపై దాడి చేసి.. బాత్రూంలో పడేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆమె మెడలోని గొలుసు, చేతి గాజులు ఎత్తుకెళ్లారని ఆయన అన్నారు.

Theft in Vempalli Kadapa District: ఈ ఘటనపై వేంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. పట్టపగలే చోరీ జరగడంతో.. స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

100 ఇళ్లల్లో దొంగతనం- 20సార్లు జైలుకు, గోవాలో మరోసారి 'ఎస్కేప్​ కార్తీక్' అరెస్ట్​​

Theft in Pendurthi విశాఖలో చోరీ: విశాఖ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. దొంగతనానికి పాల్పడి.. ఆధారాలు లభ్యం కాకుండా ఉండేందుకు వాటిని చెరిపేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పెందుర్తిలోని చిన్న మూసివాడ ఉడా కాలనీలో ఓ ఇంట్లో ప్రవేశించిన దొంగలు చోరికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఇంట్లో, ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో కారం వెదజల్లారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ ఫోన్‌ పోయిందా..? బెంగ వద్దు హాయ్‌ అని మెసేజ్‌ పెట్టండి గ్యారెంటీగా దొరుకుతుంది...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.