Theft in Kadapa district: ఇంట్లో పని చేస్తామంటూ ఇద్దరు అక్కాచెల్లెళ్లు వచ్చి ఇంట్లో బంగారు నగలను దొంగలించిన ఘటన కడప జిల్లా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు అక్కాచెల్లెళ్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
కడప రెడ్డి కాలనీకి చెందిన వేణుగోపాల్ రెడ్డి ఉదయం బయటికి వెళ్లారు. ఇంట్లో అతని భార్య ఒక్కటే ఉన్న సమయంలో... ఇద్దరు అక్కాచెల్లెళ్లు వచ్చి ఇంట్లో పని దొరుకుతుందా అని స్థానికులను అడిగారు. స్థానికులు పైఅంతస్తులో వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో పనిమనిషి కావాలని అడిగారు.. అక్కడికి వెళ్లమని తెలిపారు. ఈ మేరకు అక్క చెల్లెలు ఇంట్లోకి వెళ్లి పని కావాలని అడగడంతో వేణుగోపాల్ రెడ్డి భార్య సరే అంది. కొద్ది సేపు పని చేసిన తర్వాత తన చెల్లెలిని రోడ్డుపై వదిలేసి వస్తానని చెప్పి ఇద్దరూ బయటకు వెళ్లారు. వారు ఎంతసేపటికీ రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చి బీరువా తెరిచి చూడగా అందులో ఉండాల్సిన బంగారు కమ్మలు, గొలుసులు, సుమారు రూ.3.5 లక్షలు విలువ చేసే బంగారు నగలను దొంగలించారు. బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ పుటేజ్ ఆధారంగా అక్క చెల్లెల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: Bitcoin Fraud: బిట్‌కాయిన్ కొంటే లాభాలంటారు... ఆపై దోచేస్తారు!