కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మంగంపేట ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కడప వైపు నుంచి తిరుపతికి వెళ్తున్న వ్యాన్ ను చెన్నై నుంచి ఎర్రగుంట్లకి వెళ్తున్న ట్యాంకర్ ఢీ కొట్టింది.
వ్యాన్ డ్రైవర్ సుదర్శన్ ఆచారి మృతి చెందాడు. ముగ్గురు గాయపడగా వారిని కడప రిమ్స్ కి తరలించారు. ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థపై సీఎం జగన్ సమీక్ష