కడప జిల్లా జమ్మలమడుగు నాగుల కట్ట వద్ద ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జ్యోతుల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. కరోనా కారణంగా దేవస్థానం ఆలయ పరిసరాల్లో ఉత్సవం నిర్వహించారు. తర్వాత పట్టణంలో 8 జ్యోతులను ఊరేగింపు చేశారు. అమ్మవారి శ్లోకాలు వల్లిస్తూ జ్యోతులను తలపై పెట్టుకుని నృత్యాలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు . అనంతరం చౌడేశ్వరి దేవస్థానం ఆవరణలోకి తీసుకెళ్లి జ్యోతుల తీసుకెళ్లారు.
ఇదీ చదవండీ...