ETV Bharat / state

మౌలిక వసతులు కల్పించరు... పరిహారం ఇవ్వరు..! - kadapa updates

లక్షల ఎకరాలకు సాగునీరు అందుంతుందటే... నిర్మాణాలకు సంతోషంగా అంగీకరించారు. తరాలుగా సాగుచేసుకుంటున్న భూములను త్యాగం చేశారు. అనుబంధాలు ముడిపడిన ఊరిని వదిలేందుకు ముందుకొచ్చారు. నిర్వాసితుల కష్టాల తీర్చాల్సిన యంత్రాంగం పునరావస కాలనీలో కనీసం మౌలిక వసతులు కల్పించలేదు.. ఇళ్లు కట్టుకునేందుకు సమయం ఇవ్వలేదు.. పరిహారం అందించలేదు. ఇది కడప జిల్లాలోని కొండాపురం మండలంలోని గండికోట జలాశయం ముంపు బాధితుల దుస్థితి.

the-plight-of-gandi-kota-victims
గండికోట జలాశయం ముంపు బాధితుల కష్టాలు
author img

By

Published : Dec 19, 2020, 2:16 PM IST

గండికోట జలాశయం ముంపు బాధితుల కష్టాలు

కడప జిల్లా కొండాపురం మండలంలో గండికోట జలాశయం నిర్మాణంతో మొత్తం 22 గ్రామాలు ముంపు జాబితాలో చేరాయి. గత ప్రభుత్వ హయాంలోనే మొదటి విడత కింద 14 గ్రామాలకు పరిహారం చెల్లించి ఖాళీ చేయించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక గండికోట జలాశయం నిర్వాసితులకు పరిహారం 10 లక్షల రూపాయలకు పెంచింది. మొదటగా కొండాపురంలో పెండింగ్​లో ఉన్న వారికి పరిహారం పంపిణీ చేశారు. అనంతరం తాళ్ల పొద్దుటూరులో పరిహారం పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. తొలుత డబ్బులు చెల్లించిన నిర్వాసితుల ఇళ్లను కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. ఆ సమయంలో నిర్వాసితులు తిరగబడ్డారు.

ఉన్నఫళంగా పరిహారం తీసుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్లాలి అని ప్రశ్నించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నెలలుగా ధర్నాలు నిర్వహించారు. అయినా ప్రభుత్వం తీరు లో మార్పు రాలేదు. జలాశయంలో కొంచెం కొంచెంగా నీటి నిలువ పెంచుతూ వచ్చారు. నిర్వాసితులు తమ నిరసన విరమించిన కొద్ది రోజులకే జలాశయంలో 20 టీఎంసీలకు పైగా నిల్వ చేశారు. ప్రస్తుతం తాళ్లపొద్దుటూరులో దాదాపు ప్రతి ఇంట్లోకి వెనుక జలాలు చేరాయి. ఈనెల 11వ తేదీ నుంచి తాళ్ల పొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామాలకు విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారు. అప్పటి నుంచి గ్రామాల్లో నివసిస్తున్న కుటుంబాలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నాయి.

విద్యుత్ సరఫరా నిలిపేశారు...

తమకు సమయం ఇవ్వకుండా బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. అద్దెకు ఇల్లు కావాలంటే లక్షల రూపాయల అడ్వాన్సులు అడుగుతున్నారని... ప్రభుత్వం ఇచ్చిన పరిహారం దీనికే సరిపోయేలా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్ల పొద్దుటూరులోని విద్యుత్తు ఉపకేంద్రంలోకి నీళ్లు చేరడంతో మూడు ముంపు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గండికోట జలాశయంలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు కృషి చేస్తున్నట్లు వారు చెప్పారు. ఇందుకోసం నిర్వాసితుల నుంచి రాతపూర్వకంగా సమ్మతి కూడా తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

విధి వెక్కిరింపు... సాయం కోసం ఓ కుటుంబం ఎదురుచూపు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.