ETV Bharat / state

పీర్ల పండుగ ఎందుకు..? ఎలా..?

మృత వీరులను స్మరించుకునే పీర్ల పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. కడప జిల్లాలో ఈ పండుగను యుద్ద వీరులను తలచుకుంటూ, అగ్నిగుండంలో నడిచే ఆనవాయితీని భక్తులు కొనసాగించడం ఆసక్తిగా కనిపిస్తుంది. అగ్ని గుండ ప్రవేశం, పీర్ల చావిళ్లలో స్వాముల దర్శించుకోవడం భక్తుల్లో పరవశ్యాన్ని నింపింది.

ముస్లిం సోదరులు  భక్తి శ్రద్ధలతో మొహరం
author img

By

Published : Sep 10, 2019, 1:55 PM IST

Updated : Sep 10, 2019, 2:04 PM IST

ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో మొహరం

కడప జిల్లాలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో మొహరం వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇస్లాం ప్రపంచానికి మొహరం మాసంతోనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటమే మొహరం. దీన్నే పీర్ల పండుగ అని కూడా అంటారు. నిజానికి ఇది పండుగ కాదు, కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం తొలి పది రోజులు శోక దినలుగా గడుపుతారు. మొహరం మాసంలోని మహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమాన్ హుస్సేన్ వీర మరణానికి నిదర్శనంగా చావిడిలో పీర్లను కూర్చో పెడతారు. 10వ రోజు తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాలకు పీర్లను అగ్నిగుండంలోకి ప్రవేశపెడతారు. అనంతరం వాటిని వీధుల్లో ఎత్తుకొని ఊరేగింపు చేస్తారు .కడప జిల్లా జమ్మలమడుగు, ముద్దనూరు, మైలవరం తదితర ప్రాంతాల్లో ఈ పీర్ల పండగ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ముద్దనూరులో మొహరం పండుగ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పీర్ల ఊరేగింపు,అగ్ని గుండ ప్రవేశం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. పీర్ల చావిళ్లలో స్వాములను దర్శించుకున్నారు.

ఇదీ చదవండి:ఓ బొజ్జ గణపయ్య... పూలతో అలంకరించామయ్యా..

sample description
Last Updated : Sep 10, 2019, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.