ETV Bharat / state

వినాయ‌కుడి విగ్ర‌హం చేయి ధ్వంసం చేసింది... మతిస్థిమితం లేని మహిళే! - Anjaneya Swamy Temple news in Sunkeshula, Khajipeta Mandal, Kadapa District

రాష్ట్రంలో పలు ఆలయాల్లోని విగ్రహాలపై దుండగలు దాడులకు పాల్పడుతునే ఉన్నారు. తాజాగా కడప జిల్లా ఖాజీపేట మండలం సుంకేశులలోని ఓ ఆలయంలో విగ్రహం చేతిని ధ్వంసం చేశారు. అయితే.. ఇది మతిస్థిమితం లేని మహిళ చేసిన పనిగా గుర్తించారు పోలీసులు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

వినాయ‌కుడి విగ్ర‌హం చేయి ధ్వంసం చేసింది... మతిస్థిమితం లేని మహిళే!

author img

By

Published : Mar 25, 2021, 7:07 PM IST

క‌డ‌ప జిల్లా ఖాజీపేట మండ‌లం సుంకేశుల‌లోని ఆంజనేయ స్వామి ఆల‌య ఆవ‌ర‌ణంలో వినాయ‌కుడి విగ్ర‌హం చేయి ధ్వంసంపై పోలీసులు నిగ్గు తేల్చారు. మ‌తిస్థిమితం లేని మ‌హిళ చ‌ర్యే కార‌ణ‌మ‌ని డీఎస్పీ బి.విజ‌య్‌కుమార్ వెల్ల‌డించారు. బుధ‌వారం వినాయ‌కుడి విగ్ర‌హం ఎడ‌మ చేయి ధ్వంసం చేయ‌డంపై ఆల‌య ఛైర్మ‌న్ స‌త్య‌నారాయ‌ణ ఫిర్యాదుతో ఎస్సై అరుణ్‌రెడ్డి విచార‌ణ చేప‌ట్టారు. అందులో భాగంగానే గురువారం వేలిముద్ర‌ల నిపుణులు, పోలీసు జాగిలాన్ని ర‌ప్పించి అన్వేషించారు.

జాగిలం మ‌తిస్థిమితం లేని మ‌హిళ ఇంటి వ‌ద్ద ఆగ‌డంతో ఆమె చ‌ర్యే కార‌ణ‌మ‌ని భావించారు. ఘటనకు పాల్పడింది... మ‌తిస్థిమితం లేని మ‌హిళ కావ‌టంతో నిందితురాలుగా చేర్చే అవ‌కాశం లేకపోయింది. ఈ కారణంగా.. పోలీసులు మ‌హిళ‌ను మాన‌సిక వైద్యాల‌యానికి పంపేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇవీ చదవండి:

ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య... కళాశాలలో ఒత్తిడే కారణం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.