కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్డీనరీ బస్సు నిత్యం మైదుకూరు, కడప మార్గంలో ప్రయాణిస్తుంటుంది. ఈ బస్సు సరైన కండిషన్లో లేదు. సీటు కింద ఉన్న ఇనుప రేకుకు చీలికలు ఏర్పడ్డాయి. వాటి స్థానంలో మరో రేకు వేసిన అది కూడా...తుప్పుపట్టి రంధ్రాలు పడింది. ప్రయాణికులు తాము ఎక్కడా పడిపోతామోనన్న భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి బస్సును పరిశీలించిన తర్వాతే ప్రయాణికులను ఎక్కించుకోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వీటిని అధికారులు పట్టించుకోవడం లేదని పలువురంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఇదీచూడండి.ఆర్టీపీపీపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వాలి