కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఈద్గా మైదానంలో తెదేపా ఎంపీ సీఎం రమేష్ నిధులతో చేపట్టిన పనులకు వేసిన శిలా ఫలకం వివాదాస్పదమైంది. గత ఏడాది డిసెంబర్ లో ఈద్గాలో నీటి వసతి, ప్రహారి గోడ గేటు ఏర్పాటుకు 30 లక్షల నిధులను వెచ్చించారు. అందుకు కృతజ్ఞతలతో ఎంపీ సీఎం రమేష్ చిత్రంతో కూడిన శిలాఫలకం ఏర్పాటు చేయడాన్ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తప్పు పట్టారు. ఈద్గా మైదానం మధ్యలో శిలాఫలకం ఏర్పాటు చేయటం వల్ల పూర్తిగా ముస్లింలు ప్రార్థన చేసుకోవటానికి ఇబ్బందికరంగా ఉంటుందని ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈద్గా మైదానంలో ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని ఎమ్మెల్యేతో పాటు పలువురు ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు. శిలాఫలకం మధ్యలో కాకుండా బయటి పెట్టుకోవచ్చని నాయకులు చెప్పారు. అక్కడి నుంచి తీసివేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈద్గా వద్ద శిలాఫలకం... వైకాపా నేతల అభ్యంతరం - mla rachamallu
కడప జిల్లా ప్రొద్దుటూరు ఈద్గా మైదానంలో తెదేపా ఎంపీ సీఎం రమేష్ చిత్రముఖంతో ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. దానివల్ల ప్రార్థన సమయంలో ముస్లింలకు ఇబ్బందిగా మారింది అని అన్నారు.