తెలుగుగంగ ద్వారా కడప జిల్లాలో 2.6 టీఎంసీల నీరు చేరింది. కర్నూలు జిల్లా వెలుగోడు జలాశయం నుంచి తెలుగుగంగ కాలువ విడుదల చేసిన నీరు జిల్లాను తాకింది. దువ్వూరు మండలం చల్ల బసాయ పల్లె యోగలో ఒకటో జలాశయం నిండుకొని మైదుకూరు మండలం గంజికుంట రెండవ జలాశయానికి నీరు చేరుతోంది. కాలువలో 29 కిలోమీటర్ల దూరం ప్రవహించి బ్రహ్మం సాగర్ జలాశయంలోకి వరద చేరేందుకు వారం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బ్రహ్మం సాగర్లో ప్రస్తుతం 1.57 టీఎంసీలు నీరు ఉండగా 12 టీఎంసీల నీరు నిల్వ చేయాలని ప్రజాప్రతినిధులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదీ చదవండి: