Varla ramaiah letter to DGP: కడప జిల్లాలో గిరిజనుడు సుబ్బరాయుడు భార్య నాగమునిని వైకాపా నాయకుడు అపహరించడంపై డీజీపీకి తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య లేఖ రాశారు. మైదుకూరు మండలం తువ్వపల్లె పంచాయతీలో వైకాపా నాయకుడు సుధాకర్ రెడ్డి.. సుబ్బరాయుడు అనే గిరిజనుడి భార్య నాగమునిని అపహరించారని పేర్కొన్నారు. అప్పుగా తీసుకున్న లక్ష రూపాయలకై ఇంత నీచమా అన్న వర్ల... ఈ ఘటన చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు. కడప పోలీసులు... గిరిజనుడికి న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. బాధితురాలు నాగమునికి వైద్య పరీక్షలు నిర్వహించి తగు న్యాయం చేయాలన్నారు. డీజీపీ వెంటనే సుధాకర్‌రెడ్డిని ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద అరెస్టు చేయాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు.
"వైఎస్సార్ జిల్లాలో సుబ్బారాయుడు భార్యను అపహరించారు. నాగమునిని వైకాపా నాయకుడు సుధాకర్‌రెడ్డి అపహరించారు. అప్పుగా తీసుకున్న రూ.లక్ష కోసం ఇంత నీచమా?. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది. కడప పోలీసులు గిరిజనుడికి న్యాయం చేయడంలో పూర్తిగా విఫలం. బాధితురాలు నాగమునికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయం చేయాలి. డీజీపీ వెంటనే సుధాకర్‌రెడ్డిని ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద అరెస్టు చేయాలి." -తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య
ఇవీ చదవండి: