Flexi war in Pulivendula: నిత్యావసర ధరలపై పులివెందులలో తెదేపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించటంపై తెదేపా నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలపై బ్యానర్లు ఏర్పాటు చేస్తే.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసులు అభ్యంతరం చెప్పటం ఏంటని ప్రశ్నించారు. కీలకమైన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి.. సీఎం జగన్ పుట్టినరోజు, క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన బ్యానర్లు పెడితే ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు.
వందల సంఖ్యలో కట్టిన బ్యానర్లపై ప్రశ్నించని పోలీసులు, మున్సిపల్ అధికారులు.. ప్రజాసమస్యలపై నిలదీస్తే ఇలాంటి చర్యలకు దిగటం దారుణమన్నారు. శాంతిభద్రతల పేరుతో తెదేపా కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
రైతుల సమస్యలను వైకాపా సర్కారు.. గాలికొదిలేసిందని బీటెక్ రవి దుయ్యబట్టారు. ఇంతవరకు ఒక్క రైతుకు కూడా డ్రిప్ మెటిరీయల్ ఇవ్వలేదన్నారు. బీమా విధానం కూడా సరిగాలేదని ఆక్షేపించారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల్లో కూడా పురోగతి లేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక.. అరటి, చీనీ ధరలు ఘోరంగా పడిపోయాయని చెప్పారు.
ఇదీ చదవండి :
Balakrishna - Vasundhara Video: చీరాల బీచ్‌లో బాలయ్య సందడి.. టాప్ లెస్ జీప్‌లో సరదా రైడ్