కడప జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తెలుగుదేశం పార్టీ నేతలు కోరారు. వైకాపా నాయకులు దౌర్జన్యాలకు పాల్పడకుండా, అధికారులు ఏకపక్ష ధోరణితో వ్యవహరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు విన్నవించారు. ఈ మేరకు కడప కలెక్టరేట్లో తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, కడప పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు లింగారెడ్డి, తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తదితర దేశం నేతలు... ఎస్ఈసీని కిలిసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో వైకాపా నాయకులు దౌర్జన్యం చేశారని ఫిర్యాదు చేశామన్నారు. తమ అనుకూల అభ్యర్థులకు అవసరమైతే నియోజకవర్గానికి ఒకరికి భద్రత కల్పించేలా చూడాలని కోరినట్లు తెలిపారు. కమలాపురం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రిజర్వేషన్లలో అవకతవకలు జరిగాయని చెప్పామన్నారు. విజ్ఞాపనలను పరిశీలించిన ఎస్ఈసీ రమేశ్ కుమార్... సానుకూలంగా స్పందించారని తెదేపా నేతలు వెల్లడించారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఇదీ చదవండి