జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి బీటెక్ రవి వైరస్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు పూజలు చేశారు. ఈ మేరకు కడప జిల్లా జమ్మలమడుగులోని నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో 1,001 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగిరావాలని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం అనంతరం కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన బెంగళూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెదేపా నాయకులు తెలిపారు.
ఇదీ చూడండి: ఒక్కరోజు 2 లక్షల 59 వేల కేసులు- 1761 మరణాలు