కరోనా వ్యాప్తి నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆస్పత్రిలో ప్రాణవాయువు లేక ఎందరో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్ ఎమర్జెన్సీ) విధించాలని డిమాండ్ చేశారు. కడపలో మాట్లాడిన గోవర్ధన్ రెడ్డి... ఆస్పత్రుల్లో పడకలు లేక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం స్పందించి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
ఇదీ చదవండి: