ETV Bharat / state

'శ్రీశైలంలోని మిగులు జలాలు వాడుకునే హక్కు ఏపీకి మాత్రమే ఉంది'

author img

By

Published : Aug 19, 2020, 4:04 PM IST

శ్రీశైలంలోని మిగులు జలాలను వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్​కు మాత్రమే ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మన నీటిని వాడుకుంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.

tdp leader govardhan reddy about srisailam water
గోవర్దన్ రెడ్డి, తెదేపా నేత

శ్రీశైలంలోని మిగులు జలాలను వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్​కు మాత్రమే ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కడపలో మాట్లాడుతూ.. కృష్ణ బోర్డు పలుమార్లు హెచ్చరించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాలను తరలించుకుపోవడం దారుణమని ఆయన అన్నారు. ఈరోజు సాయంత్రం శ్రీశైలం గేట్లను ఎత్తివేస్తే నీరు సముద్రం పాలవుతుందన్నారు.

కడప జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టులో చుక్క నీరు లేదని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టులలో నీటిని ఎప్పుడు నింపుతారో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సాగు జలాల్లో సీమకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మన నీటిని వాడుకుంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.

ఇవీ చదవండి...

'ఈఎస్ఐ కేసులో రూ.105కోట్ల మేర అవకతవకలు జరిగాయి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.