కడప జిల్లా కమలాపురం మండలంలోని పలుగ్రామల రైతులు, గొర్రెల కాపరుల దీనస్థితిని చూసి తెదేపా రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ చలించిపోయారు. ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున దాదాపు వంద కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి కొండయ్య పల్లె, అప్పారావుపల్లెతో పాటు పలు గ్రామాల్లో కాశీభట్ల సాయినాథ్ శర్మ పర్యటించారు. అక్కడ పంట నష్టపోయిన రైతులను, గొర్రెలను నష్టపోయిన కాపలాదారులను చూసి విచారం వ్యక్తం చేశారు. దాదాపు వంద కుటుంబాలకు రూ. వెయ్యి చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఆయన అందించిన సాయంపై ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: