ETV Bharat / state

Viveka Murder Case: 'వివేకాను హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసు' - వివేకా మర్డర్ కేసు తాజా వార్తలు

మాజీ మంత్రి వివేకానందరెడ్డిని చంపిందెవరో అందరికీ తెలుసని.. ఈ కేసులో అరెస్టైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్‌ అన్నారు. సీబీఐ వేధింపులు తట్టుకోలేక రిట్ పిటిషన్ వేస్తే..తమపై కక్ష సాధిస్తున్నారన్నారు.

sunil yadav brother on viveka murder case
వివేకాను హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసు
author img

By

Published : Aug 11, 2021, 7:34 PM IST

మాజీ మంత్రి వివేకానందరెడ్డిని చంపిందెవరో అందరికీ తెలుసునని ఈ కేసులో అరెస్టైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్‌ అన్నారు. పులివెందులలోని అనుమానితుల ఇళ్లలో ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సునీల్‌ యాదవ్, దస్తగిరి కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కత్తి, కొడవలి, పలుగు, పారను స్వాధీనం చేసుకున్నారు.

సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన కిరణ్ యాదవ్..తాము సాధారణ వ్యక్తులమే కానీ..వివేకాను హత్య చేసే అంతటోళ్లం కాదన్నారు. సునీల్ యాదవ్ ఖాతా పుస్తకాలు, పాత చొక్కాను సీబీఐ అధికారులు తీసుకెళ్లినట్లు కిరణ్ యాదవ్ వెల్లడించారు. సీబీఐ వేధింపులు తట్టుకోలేక రిట్ పిటిషన్ వేస్తే..తమపై కక్ష సాధిస్తున్నారని అన్నారు.

వివేకాను హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసు

కర్ణాటక నుంచి అధికారులు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో 66వ రోజు విచారణ కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో అనుమానితులను విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగారానికి కర్ణాటక నుంచి 20 వాహనాల్లో బ్యాంకు అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చినట్టు సమాచారం.

కడపకు చెందిన ముగ్గురు బ్యాంకు అధికారులు ఇవాళ విచారణకు హాజరయ్యారు. కర్ణాటకలో ల్యాండ్ సెటిల్​మెంట్​కు సంబంధించి వివేకా, సునీల్ మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో అక్కడి బ్యాంక్ అధికారులు, రెవెన్యూ సిబ్బందిని సీబీఐ అధికారులు పిలవడం చర్చనీయాంశమైంది. సునీల్ యాదవ్ కస్టడీలో ఇచ్చినటువంటి సమాచారం మేరకు అన్ని ప్రాంతాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి మధ్యాహ్నం సీబీఐ అధికారులను కలిసి వెళ్లారు. కేసు దర్యాప్తు గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి

viveka murder case: వైఎస్​ వివేకా కేసు..అనుమానితుల ఇళ్లలో ఆయుధాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.