ఉదయం..సాయంత్రం
కడప మున్సిపల్ మైదానంలో జిల్లా క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు వివిధ క్రీడల్లో తర్ఫీదునిస్తున్నారు. క్రికెట్, కబడ్డీ, థైక్వాండో, హాకీ, వాలీబాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ నేర్పిస్తున్నారు. కడప క్రీడా పాఠశాలకు చెందిన నిపుణులు శిక్షణ ఇస్తున్నారు.
కరాటే, థైక్వాండోపై మహిళలు ఆసక్తి
ఈ వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థులు ఉత్సాహంగా తరలివస్తున్నారు. బాలికలు ఎక్కువగా ఆత్మరక్షణ కోసం కరాటే, థైక్వాండో నేర్చుకుంటున్నారు.
ఈనెల 31వరకు సాగే వేసవి శిబిరాలను పిల్లలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా సాధికార సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.