పెళ్లి చేసుకోమంటే ప్రేమించిన యువకుడు నిరాకరించాడనే మనస్థాపంతో ఓ యువతి విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన కడప జిల్లా వేంపల్లెలోని గాజులపేటలో జరిగింది. ఆ యువతిని వారి కుటుంబసభ్యులు హుటాహుటిన వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు తనను ప్రేమిస్తున్నాని చెప్పి మోసం చేశాడని, అందుకే విషం తాగినట్లు ఆమె చెప్పారు. తనకు ఏదైనా జరిగితే అతనే బాధ్యుడని పేర్కొంది.
ఇవీ చదవండి