ETV Bharat / state

క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం నిర్మించాలని విద్యార్థి జేఏసీ పాద‌యాత్ర

author img

By

Published : Mar 17, 2021, 3:03 PM IST

క‌డ‌ప జిల్లాలో ఉక్కు క‌ర్మాగారం నిర్మించాల‌ని డిమాండ్​ చేస్తూ.. విద్యార్థి జేఏసీ పాద‌యాత్ర చేపట్టారు. సెయిల్ ఆధ్వ‌ర్యంలో వెంటనే ఈ పరిశ్రమను నిర్మించాలంటూ నినాదాలు చేశారు.

Student JAC
క‌డ‌ప ఉక్కు క‌ర్మాగార నిర్మాణం కోసం విద్యార్థి జేఏసీ పాద‌యాత్ర

క‌డ‌ప జిల్లాలో ఉక్కు క‌ర్మాగారం నిర్మించాల‌ంటూ.. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పాద‌యాత్ర చేపట్టారు. ఈ నెల 15న జ‌మ్మ‌ల‌మ‌డుగులోని ఉక్కు శిలాఫ‌ల‌కం నుంచి చేప‌ట్టిన ఈ పాద‌యాత్ర.. నేడు మైదుకూరు చేరుకుంది. ఈ క్రమంలో స్థానిక విద్యార్థులు వారికి స్వాగతం పలికారు. అలాగే జేఏసీ నాయ‌కుల వెంట న‌డిచి త‌మ సంఘీభావాన్ని ప్ర‌క‌టించారు. కేంద్ర ప్ర‌భుత్వం వెంట‌నే సెయిల్ ఆధ్వ‌ర్యంలో ఉక్కు క‌ర్మాగారం నిర్మించేలా ప్ర‌క‌ట‌న చేయాల‌ని వారు డిమాండ్​ చేశారు. ల‌క్ష‌లాది మందికి ఉపాధి క‌ల్పిస్తున్న విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీక‌ర‌ణను విర‌మించుకోవాల‌ని కోరుతూ.. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండీ.. వైకాపా నేతల అక్రమాలకు ఏపీలోని జైళ్లు సరిపోవు: ధూళిపాళ్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.