ETV Bharat / state

సా లంకలో శతాబ్ధాల కాలం నాటి శాసనాలు - కడప జిల్లాలో 14వ శతాబ్ధపు విగ్రహాలు లభ్యం తాజా వార్తలు

ముని కుమార్ అనే విద్యార్థి జరిపిన పరిశోధనల్లో కడప జిల్లా అట్లూరు మండలం కొండూరు గ్రామ సమీపంలోని లంకమలలో పురాతన విగ్రహాలను గుర్తించారు. ఇవి 7, 14 శతాబ్ధాలకు చెందిన శాసనాలుగా పురావస్తు శాఖ నిపుణులు వెల్లడించారు.

inscriptions and statues in Centuries-old
శతాబ్ధాల కాలం నాటి శాసనాలు, విగ్రహాలు
author img

By

Published : Nov 8, 2020, 3:03 PM IST

దట్టమైన అభయారణ్యంలో కడప జిల్లా అట్లూరు మండలం కొండూరు గ్రామ సమీపంలోని ఉంది లంకమల. దీనికి సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువైన సా లంకలో 7, 14వ శతాబ్దానికి చెందిన పురాతన శాసనాలు లభ్యమయ్యాయి. ముని కుమార్ అనే విద్యార్థి పరిశోధన నిమిత్తం సా లంక ఆలయ ప్రాంతాలకు వెళ్లి పరిశోధనలు చేసేవాడు. కొండూరు గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సాయంతో జరిపిన ఈ పరిశీలనలో పురాతన విగ్రహాలు, శాసనాలు లభ్యమయ్యాయి. నాగ లిపి సంస్కృతంలో ఉన్న శాసనాలను గుర్తించారు.

ఇక్కడ లభించిన సార్​ పురాతనమైన అరుదైన శాసనాలుగా పురావస్తు శాఖ నిపుణులు తెలిపారు. అయితే 'మచ్చ లంక వెళ్లి వచ్చుట కంటే సా లంక వెళ్లి చచ్చుట మేలు' అన్న నానుడి ఉన్న అటవీ ప్రాంతంలో పరిశోధనలు జరిపి అరుదైన విగ్రహాలను గుర్తించడం అభినందించదగ్గ అంశమని పురావస్తు శాఖ నిపుణులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

'సమ్మెతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.