కడప జిల్లా సున్నపురాళ్ల పల్లె వద్ద ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. సంయుక్త కలెక్టర్ గౌతమి, జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ ఎండీ మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సున్నపురాళ్లపల్లె, పెద్ద దండ్లూరు గ్రామాలకు చెందిన ప్రజలు హాజరై పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కర్మాగారం ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. సుమారు రూ.20 వేల కోట్లతో ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తున్నామని, స్థానికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
ఇదీచదవండి