ఆంధ్రప్రదేశ్‌ను ఆంగ్లప్రదేశ్‌గా మార్చాలని వైకాపా ప్రభుత్వం చూస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి అన్నారు. సర్కార్ బడుల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం దారుణమని విమర్శించారు. కడప జిల్లా వేంపల్లిలో మాట్లాడిన ఆయన.. పొరుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలు వారి మాతృ భాషను కాపాడుకోవడానికి కృషి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పనికట్టుకుని మాతృభాషను హత్య చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తెలుగుభాష కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఈ జీవోను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: