అధికార, ప్రతిపక్షాల తీరును కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లెలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఎద్దేవా చేశారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తామని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. ఇదే తరహాలో మూడు రాజధానులంటూ... అరచేతిలో కైలాసం జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారని విమర్శించారు.
ఇవీ చూడండి...