అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి రూ. 10 లక్షలు విరాళం అందజేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో.. ఆయన మీడియాతో మాట్లాడారు.
9 లక్షల రూపాయల మొత్తాన్ని చెక్కులుగా.. మరో లక్ష రూపాయలను నగదు రూపంలో.. రామజన్మభూమి ప్రతినిధులకు సమర్పించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: