వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కల్యాణం - కడపలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం
కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని బండాఆత్మకూరు సుదర్శన శర్మ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోకహితం కోసం, వర్షాలు సమృద్ధిగా పడాలని, విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. స్వామివారి కల్యాణం తిలకించేందుకు భక్తలు తరలివచ్చారు.